- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో చోటుచేసుకున్న పసుపు నీళ్ల వివాదంపై తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయకుండా, కేవలం చట్టపరమైన నోటీసులు ఇచ్చి మాత్రమే దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేస్తూ పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతంలో కాంగ్రెస్ నిరసన ముగిసిన అనంతరం బిఆర్ఎస్ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకుని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు.
- Advertisement -



