Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ విమానాలు ఆలస్యం..ప్రయాణికుల ఆందోళన

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ విమానాలు ఆలస్యం..ప్రయాణికుల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : స్పైస్‌జెట్‌కు చెందిన రెండు విమానాలు 24 గంటలకుపైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌ వెళ్లాల్సిన ఎస్‌జీ 5111, ఎస్‌జీ 5105 విమానాలు సోమవారం షెడ్యూల్‌ ప్రకారం బయల్దేరలేదు. పలుమార్లు రీషెడ్యూల్‌ చేసినా విమానాలు కదలకపోవడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు టెర్మినల్‌-3 వద్ద నిరసనకు దిగారు. దీనిపై స్పందించిన స్పైస్‌జెట్‌ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, అవసరమైతే ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -