Tuesday, September 15, 2026
E-PAPER
Homeజాతీయంగురుగ్రామ్‌ స్పోర్ట్స్ బైక్ కేసు..కళ్యాణ్ బైన్స్‌లా అరెస్టు

గురుగ్రామ్‌ స్పోర్ట్స్ బైక్ కేసు..కళ్యాణ్ బైన్స్‌లా అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: గురుగ్రామ్‌లో స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న మహిళను కారుతో ఢీకొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ బైన్స్‌లాను మంగళవారం రాజస్థాన్‌లోని దౌసాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడైన లవ్‌నీష్ గుర్జార్‌ను కూడా బైన్స్‌లాతో పాటే అరెస్టు చేసినట్లు వారు పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా, నిందితుడైన కారు డ్రైవర్‌పై గురుగ్రామ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేరానికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

కాగా, సియా, ఆమె స్నేహితులు స్పోర్ట్స్ బైక్‌లపై గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై వెళ్తున్నారు. సియాను కల్యాణ్ అనే వ్యక్తి కారుతో వెంబడించాడు. ఆమెను బైక్‌ ఆపాలని అతను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె మాత్రం తనను ఎందుకు ఫాలో అవుతున్నావని, కారును తనకు దూరంగా పోనివ్వాలని కోరినట్లు సమాచారం. అయితే, కొంత దూరం వెళ్లిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన కల్యాణ్ కారు.. సియా బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె ద్విచక్రవాహనంతో సహా రోడ్డుపై పడిపోయింది. బైక్ కొంత దూరం మేర నిప్పులు చిమ్ముకుంటూ ఈడ్చుకెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -