Tuesday, September 15, 2026
E-PAPER
Homeజిల్లాలుమంత్రి శ్రీధర్ బాబును కలిసిన కాటారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష‍ులు

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన కాటారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష‍ులు

- Advertisement -

పలు సమస్యలపై వినతి.. సానుకూలంగా స్పందించిన మంత్రి
నవతెలంగాణ – మల్హర్ రావు

కాటారం డివిజన్ లోని మల్హర్, కాటారం, మహాదేవపూర్, మహముత్తరాం మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్, తేప్పల దేవేందర్, కటకం అశోక్, జాడి రాజయ్య ఇటీవలే నియామకం అయిన నేపథ్యంలో మంగళవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాపూర్వకగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో నెలకొన్న పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ సంస్థాగత బలోపేతానికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

పై అంశాలను మంత్రి శ్రద్ధగా ఆలకించి, వాటి అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తగిన పరిష్కారాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సూచించారని తెలిపారు. దీంతో నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -