- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల వ్యాప్తంగా ఆసరా పించన్లకు 669 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఎంపీడీఓ సాయిలు మంగళవారం తెలిపారు. గ్రామాల వారిగా దరఖాస్తులను పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఒంటరి మహిళ, వితంతువు, వికలాంగులు చేసుకున్న దరఖాస్తులు తీసుకున్నామనీ, వీటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి ఆసరా పెన్షన్ల మంజూరైన వెంటనే పంచాయతీల వారీగా నూతన పెన్షన్ల లిస్టు ప్రకటిస్తామని చెప్పారు.
- Advertisement -



