Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమెరికాలో ఘోర ప్రమాదం..ఇద్దరు మృతి

అమెరికాలో ఘోర ప్రమాదం..ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని న్యూయార్క్‌ లోయర్‌ మాన్‌హటన్‌ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భారత సంతతి యువతి మలైకా చిత్రె (24), నేపాల్‌ సంతతికి చెందిన నవం కౌల్‌ ఆదివారం తెల్లవారుజామున సబ్‌వే ప్లాట్‌ఫామ్‌పై ఉండగా.. కౌల్‌ ప్రమాదవశాత్తు ట్రాక్‌పై పడిపోయాడు. అతడిని కాపాడేందుకు చిత్రె కూడా ట్రాక్‌పైకి దూకింది. ఇంతలో రైలు దూసుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరూ రట్జెర్స్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఈ ఘటనపై న్యూయార్క్‌ పోలీస్‌ శాఖ దర్యాప్తు చేపట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -