- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వరదరాజ్‌పూర్ మాజీ సర్పంచ్‌తో పాటు ఆరుగురు బీఆర్ఎస్ నేతలను విజయవాడలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఫోన్ లొకేషన్ ఆధారంగా వారిని గుర్తించిన పోలీసులు గజ్వేల్‌కు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితులను సిద్దిపేట జైలుకు తరలించారు. దళితులను అవమానించారంటూ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఫామ్‌హౌస్ పరిసరాల్లో పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు.
- Advertisement -


