Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్మీ ఆయుధాల చోరీ..నేడు నిందితుడిని కస్టడీకి తీసుకోనున్న పోలీసులు

ఆర్మీ ఆయుధాల చోరీ..నేడు నిందితుడిని కస్టడీకి తీసుకోనున్న పోలీసులు

- Advertisement -

హైదరాబాద్‌: బొల్లారం ఆర్మీ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు ప్రధాన నిందితుడు, మాజీ హవిల్దార్‌ మల్లేశ్‌ను పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. సికింద్రాబాద్‌ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించడంతో చంచల్‌గూడ జైలు నుంచి తీసుకెళ్లి విచారించనున్నారు. ఏకే-47లు, పిస్తోళ్లు, మందుగుండు సామగ్రి చోరీకి కారణాలు, మల్లేశ్‌కు ఉన్న ఇతర వ్యక్తుల సంబంధాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. ఫోన్‌లో డిలీట్‌ చేసిన డేటాను రికవరీ చేస్తున్న దర్యాప్తు బృందాలు.. జింఖానా మైదానంలో అతడిని కలిసిన వ్యక్తి, గతంలో పనిచేసిన రాష్ట్రాల్లోని పరిచయాలపైనా దృష్టి సారించాయి. మరో ఆర్మీ ఉద్యోగి సహకారం, ఆయుధాల విక్రయం లేదా అప్పగింత, నెట్‌వర్క్‌ కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కేసు వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థలకు అందించే అవకాశముంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -