- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టెక్ దిగ్గజసంస్థ ఒరాకిల్‌లో ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ మొదలైంది. విస్తృత సంస్థాగత మార్పుల్లో భాగంగా ఉద్యోగాలను తొలగించినట్లు సంబంధిత ఉద్యోగులకు ఉదయం 6 గంటలకే ఈ-మెయిళ్ల ద్వారా తెలియజేసింది. ఈ తాజా ఉద్యోగ కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సంబంధిత ఉద్యోగులు తమ తొలగింపుల వార్తలను లింక్డ్ఇన్, రెడ్డిట్, బ్లైండ్లలో కూడా పంచుకున్నారు. ఈ తాజా తొలగింపుల వల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారన్నది ఒరాకిల్ వెల్లడించలేదు. మెయిల్ వచ్చిన రోజే ఉద్యోగి చివరి పని దినమని పేర్కొంది.
- Advertisement -

