- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, మహబూబాబాద్, కొత్తగూడెం, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, జగిత్యాల తదితర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురవవచ్చు. ఇక హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
- Advertisement -


