- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లా ఫుల్‌పూర్ పరిధిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక చవితి వేడుకల్లో పాల్గొని 9 మంది కారులో తిరిగి వస్తుండగా, జగదీష్‌పూర్ సమీపంలో అతివేగం వల్ల కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



