Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేద, గిరిజన ప్రజలకు అండగా ఉంటా: సర్పంచ్‌

పేద, గిరిజన ప్రజలకు అండగా ఉంటా: సర్పంచ్‌

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
పేద గిరిజన ప్రజలకు ఆపద సమయంలో అండగా ఉంటాననీ, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్నిస్తే వారు కృంగిపోరని సర్పంచ్ ధర్మానాయక్ అన్నారు. సోమవారం మండలంలోని ఈదులబాయి తండా గ్రామపంచాయతీ పరిధిలోని పాతావత్ లక్ష్మణ్ నాయక్ ఆకస్మికంగా మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని అందిస్తూ, కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అంత్యక్రియలకు తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ, అవసరమైన సమయంలో ముందుండి సహాయం చేయాలని యువకులకు సూచించారు. పాతావత్ లక్ష్మణ్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్ నాయక్, వార్డ్ మెంబర్ బజ్య నాయక్, మాజీ వార్డ్ మెంబెర్ బిచ్య, సమియా, తిరుపతి, కిష్నా,రాంసిగ్య, కిష్ట తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -