Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది: సర్పంచ్‌ 

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది: సర్పంచ్‌ 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, చాలామంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది ఉపాధ్యాయులేనని సర్పంచ్ సుజాత-మల్లికార్జునరెడ్డి అన్నారు. మండలంలోని మున్నూరు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ గౌడ్ ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర అవార్డు, లక్ష్మయ్య జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సర్పంచ్‌, వార్డు సభ్యులు సంయుక్తంగా అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు.

అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ.. విద్యారంగంలో వారు అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. మున్ననూరు గ్రామానికి మీ వల్ల రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. అంతకుముందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ స్వామిరెడ్డి పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంగయ్య, పాషా  బండారి వెంకటయ్య, మార్ కొండయ్య, వెంకటయ్య ,రాఘవరెడ్డి ,నరసింహ , వాడు మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -