Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నశక్కర్గ సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

చిన్నశక్కర్గ సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మండల పరిధిలోని చిన్నశక్కర్గ సర్పంచ్‌ దిగంబర్‌ అనారోగ్యంతో నిజామాబాద్‌లోని హోప్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌లు సంయుక్తంగా ఆస్పత్రికి వెళ్ళి మంగళవారం పరామర్శించారు. అధైర్యపడొద్దనీ, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం వైద్యులతో మాట్లాడి దిగంబర్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -