- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని పెద్దఎక్లారా సర్పంచ్ మహేష్ కుమార్ అన్నారు. మంగళవారం లబ్దిదారులకు స్మార్ట్రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పంచాయితీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు గ్రామస్తులు, రేషన్ వినియోగదారులు పాల్గొన్నారు.
- Advertisement -



