నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి డివిజన్ వైద్యాధికారి డాక్టర్ రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారనీ, విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేసి, కంటి సమస్యలు, దృష్టిలోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారని చెప్పారు. మనిషి జీవనంలో కళ్ల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. దృష్టిలోపం లేదా ఇతర కంటి సమస్యలు ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. కళ్ల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి, పాఠశాల నర్సింగ్ అధికారి భారతి, వైద్య బృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మైనారిటీ గురుకులలో ఉచిత కంటి వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



