నవతెలంగాణ-ఆలేరు టౌను
సమాజ హితం కొరకు యువత కృషి చేయాలని, గురుస్వాములు వేదానందగిరి స్వామి, నిర్వీశేష ఆనంద గిరి స్వామి అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం కీర్తిశేషులు యేలుగల సుగుణ, బాల నరసయ్య, వ్యవసాయ క్షేత్రం వద్ద, శ్రీ వెంకటేశ్వరనంద, చిదానంద స్వామి తపోద్యాన ఆశ్రమంలో వివిధ తపోధ్యాన ఆశ్రమాల నుండి వచ్చిన గురువులచే సామూహిక హోమం, ఆశ్రమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని జన్మలలో మానవ జన్మ ఎంతో పవిత్రమైనది అన్నారు. సమాజా హితం కోరుతూ మంచి కార్యములతో జన్మ సార్ధకం చేసుకోవాలన్నారు.
వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఆశ్రమ వార్షికోత్సవాలకి తరలివచ్చారు. గురువులకు కండువాలు వేసి సన్మానం చేశారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


