నవతెలంగాణ-హైదరాబాద్: దళిత యువకుడు గుల్జార్ సింగ్ ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యంలో , పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర నూతన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆర్థిక మంత్రి నివాస ముట్టడికి యత్నించరు. దీంతో అప్రమత్తమైన పోలీస్ బలగాలు నిరసనకారులను చీమా నివాసం వద్దకు చేరుకోకుండా అడ్డుకున్నారు.
ఆందోళకారులను ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి పోలీసులు వాటర్ కెనాన్లను ఉపయోగించారు. ఈ చర్యలో పార్టీ సీనియర్ నాయకుడు కుల్జిత్ నాగ్రాతో సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. ఆర్థిక మంత్రితో కాంగ్రెస్కు వ్యక్తిగత సమస్యలు ఏమీ లేవని సచిన్ పైలట్ అన్నారు. అయితే, గుల్జార్ సింగ్ తన మరణ వాంగ్మూలంలో మంత్రి పేరును ప్రస్తావించినప్పటికీ, ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు.



