Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబిర్యానీ పాత్రలో అలరిస్తా

బిర్యానీ పాత్రలో అలరిస్తా

- Advertisement -

హీరో నాని నటించిన పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌ వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరు కూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. ఈ సందర్భం గా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిం చిన సంపూర్ణేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమాలోని బిర్యాని క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకు నేను అలాంటి క్యారెక్టర్ చేయ లేదు. చాలా సీరియస్ గా ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన అన్ని పాత్రలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో నానికి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సినిమా ఆసాంతం నా క్యారెక్టర్ ఉంటుంది. మూడు సంవత్సరాల క్రితం నాకు ఇలాంటి క్యారెక్టర్ వచ్చి ఉంటే నా కెరీర్ లో జరిగిన కొన్ని మిస్టేక్స్ జరిగేవి కావు. నాని, శ్రీకాంత్తో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను ఇంత పెద్ద సినిమా ఎప్పుడు చేయలేదు. నా మీద మేకర్స్ చాలా నమ్మకం పెట్టారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని నా వంతు కృషి చేశాను. నాని నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు. షూటింగ్ సెట్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నాని డెడికేషన్ అద్భుతం. నేను ఏదైనా చక్కగా పర్ఫార్మ్ చేస్తే మెచ్చుకునేవారు. ఈ ఆఫర్ రావడానికి కారణం దర్శకుడు సాయి రాజేష్. నేను మోహన్ బాబు బ్యానర్ లో ఒక సినిమా చేశాను. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం చాలా హ్యాపీ. ఆయన కాంబోలో ఉన్న సీన్స్‌ బాగా ఎంజాయ్‌ చేశాను. ఎప్పటి నుంచో ఉన్న కల నెరవేరి నట్టుగా అనిపించింది. నాకు డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంది. త్వరలోనే ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్రకటన ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -