3 వికెట్లతో మెరిసిన నితీశ్
అర్థ సెంచరీతో చెలరేగిన సంజు
రెండో టీ20లో
భారత్ ఘన విజయం
అఫ్గనిస్తాన్ 159/8,
భారత్ 163/3
నవతెలంగాణ-న్యూఢిల్లీ : వరుసగా రెండో టీ20లో టీమ్ ఇండియా ఏకపక్ష విజయం నమోదు చేసింది. బంతితో, బ్యాట్‌తో ఎదురులేని ప్రదర్శన కనబరిచిన శ్రేయస్ సేన 7 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. 160 పరుగుల ఛేదనలో ఓపెనర్ సంజు శాంసన్ (57, 22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అభిషేక్ శర్మ (39, 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (38 నాటౌట్, 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 14.5 ఓవర్లలోనే 3 వికెట్లకు భారత్ 163 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (37, 33 బంతుల్లో 6 ఫోర్లు), రషీద్ ఖాన్ (28, 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డార్విశ్ రసూల్ (26, 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), మహ్మద్ నబి (20, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) అఫ్గాన్‌కు గౌరవప్రద స్కోరు అందించారు. భారత బౌలర్లలో పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (3/24) మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ (2/35), జశ్‌ప్రీత్ బుమ్రా (1/25), అక్షర్ పటేల్ (1/28), రవి బిష్ణోయ్ (1/32) రాణించారు. భారత్, అఫ్గనిస్తాన్ మూడో టీ20 గరువారం ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోనే జరుగనుంది.



