Wednesday, August 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ..

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఫైర్ ఎన్ఓసీలు) సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన అధికారులు 8 ప్రైవేటు జూనియర్ కాలేజీలపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో హైడ్రా పేరుతో రూపొందించిన నకిలీ ఫైర్ ఎన్ఓసీలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ పత్రాల ఆధారంగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడంతో లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ఆర్ నగర్, మెహిదీపట్నం, బర్కత్‌పురా ప్రాంతంలోని ఎనిమిది ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -