నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫోక్సో చట్టం–2012పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా సోషల్ కౌన్సిలర్ యశోద, సఖి వన్ స్టాప్ సెంటర్, చైల్డ్‌లైన్ సూపర్వైజర్ సామల వెంకటేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఫోక్సో చట్టం, ఆన్‌లైన్ భద్రత, లైంగిక వేధింపులను గుర్తించడం, పిల్లల రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, మహిళా హెల్ప్‌లైన్ 181, 112 నంబర్ల గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీ రాజేందర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



