Wednesday, August 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి 

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
ప్రజలకు అందుబాటులో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, రాఘవ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పులిపలుపుల మహేష్ కోరారు. ఆలేరు పట్టణంలో బుధవారం  మెడిసిటీ హాస్పిటల్స్ వైద్య బృందం సహకారంతో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా 480 మంది వైద్య శిబిరానికి హాజరై, వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 80 మందినీ పలు రకాల ఆపరేషన్లకు హాస్పటల్ కు రెఫర్ చేశారు. మెడిసిటీ హాస్పిటల్ వైద్య బృందం మహిళలకు, పురుషులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  3,4 వార్డుల కౌన్సిలర్ లు యాట శివ, బీజని కళ్యాణి మధు, మంగ నరసింహులు, పంతం కృష్ణ ,కుర్షిద్ పాషా, సంస్థ ప్రతినిధులు కళ్లెం జితేందర్ ,మొరిగాడి సిద్దులు, గుండ్రజు నరసింహారాజు ,కొత్వాల్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -