Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ అధ్యక్షతన ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి కూలీలకు అందించడం జరిగిందని  జిపి కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు ఉదయం పూట ఆరు గంటల లోపే పని ప్రదేశానికి వెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రత పెరిగినందువలన ప్రతి ఒక్కరు చల్లటి వాతావరణం లోనే పనులు నిర్వహించాలని ఎండలు ఎక్కువైనప్పుడు చెట్టు నీడకు టెంట్ కింద బస చేయాలని  అన్నారు. ఎండ తగిలి ఏదైనా ఇబ్బందులు కలిపితే వెంటనే రతమ చికిత్స కొరకు ప్రభుత్వం పంపిణీ చసిన ఓ ఆర్ ఎస్ పౌడర్ ను నీటిలో కలిపి ఇవ్వాలని  తెలిపారు. ప్రతి ఒక్క కూలీలు కొలతల ప్రకారమే పనులు నిర్వహించాలని ఉన్నారు. ఏవైనా సమస్యలు తల్లికి తమ దృష్టికి తీసుకురావాలని గ్రామ కార్యదర్శి భరద్వాజ్ సూచించారు ‌. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ జీబీ కార్యదర్శ ఆశ వర్కర్ నాగమణి, జిపిఓ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -