నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీల వ్యవస్థ అద్వానంగా మారడంతో దుర్వాసన వ్యదజల్లుతొందని ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపై,ఇళ్లలోకి చేరుతొందని వాపోతున్నారు.ఎస్సీ కాలనీ నుంచి పాత బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో ప్రజలు,మహిళలు, వృద్ధులు ఈ మార్గంలో ప్రయాణించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. రోడ్డుపై మురుగు నీరు కారణంగా నడవడమే కష్టంగా మారిందని చెబుతున్నారు.ఈ సమస్య గురించి గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజీలకు శాశ్వతంగా పరిస్కారం చూపాలని కోరుతున్నారు.
తాడిచెర్ల ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు అద్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


