- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఊరుకొండ మండలం మాదారం గ్రామపంచాయతీ పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊరుకొండ మండలం మాదారం గ్రామపంచాయతీ పరిధిలో గల చెన్నంపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి సుమంత్(23) ట్రాక్టర్ నడుపుకుంటూ వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు స్థానికులు మృతదేహంతో ధర్నా చేపడుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



