Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలిక ఆత్మహత్య నిందితుల అరెస్టుకు డిమాండ్ 

బాలిక ఆత్మహత్య నిందితుల అరెస్టుకు డిమాండ్ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల మౌనిక (17) ఈనెల 2 న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.మౌనిక మృతికి అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కారణమంటూ మృతురాలి తండ్రి వరికుప్పల శ్రీనివాస్ అదే రోజు మర్రిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.వారం గడుస్తున్న నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని వెంటనే నిందితులను అరెస్టు చేసి,వారిపై కేసు ఫైల్ చేసి,తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.రోడ్డుపై వాహనాలు భారీ స్థాయిలో ఆగి,రాకపోకలకు ఇబ్బంది కలిగి,పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు అప్రమత్తమై కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళనలను విరమింపజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -