నవతెలంగాణ-కుభీర్
మండలంలోని ఆయా గ్రామంలో సోమవారం నుంచి నిర్వహించే గణేష్ ఉత్సవాలకు ప్రతి ఒక్కరు సహకరించి ఉత్సవాలను శాంతి యూత వాతావరణం లో జరుపుకోవాలని బైంసా రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కుభీర్ పోలీస్ స్టేషన్ గణేష్ నిర్వాహకులు మరియు కుల సంఘ సభ్యులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సి ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామమలో గణేష్ మండపల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తి శ్రద్దలతో పండగను జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారుల సమాచారం అందించి మండపలకు తీసుకోవాలని సూచించారు. దింతో పాటు నిమర్జనం రోజున ఎట్టి పరిస్థితి లో మహారాష్ట్ర డిజే లకు అనుమతులు ఇవ్వబొమని చెప్పారు. రాత్రి సమయంలో విగ్రహల వద్ద ఒక్కరు తప్పనిసరిగా ఉండేలా చూడలన్నారు. ఈ కార్యక్రమం లో కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి విద్యుత్ శాఖ ఏఈ కదం ఆదిత్య, స్థానిక సర్పంచులు కందురు సాయినాథ్, సత్యనారాయణ ఆయా గ్రామాల సర్పంచులు గణేష్ నిర్వాహకులు తదితరులు ఉన్నారు.



