Friday, September 11, 2026
E-PAPER
Homeజాతీయంవాణిజ్యంలో బ్రిక్స్ దేశాల జాతీయ కరెన్సీలను వాడాలి

వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల జాతీయ కరెన్సీలను వాడాలి

- Advertisement -
  • ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తో పీఎం మోడీ ద్వైపాక్షిక చర్చలు

నవతెలంగాణ-హైదరాబాద్: వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల జాతీయ కరెన్సీలను ఉపయోగించడం కూటమి సభ్యులకు ముఖ్యమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పిలుపునిచ్చారు. డాలర్‌పై ఆధారపడటం నుండి దేశాలకు విముక్తి కల్పించడానికి, అమెరికా ఆధిపత్యాన్ని ఎదిరించడానికి BRICS బ్యాంకును ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఆర్థిక సాధనాలపై గుత్తాధిపత్యం లేని, ఏ దేశ వాణిజ్యానికి అంతరాయం కలిగించలేని వాతావరణాన్ని బ్రిక్స్ తప్పనిసరిగా సృష్టించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు భారత్ కు ఉన్న విస్తృత దౌత్యపరమైన సంబంధాలను వినియోగించుకోవాలని పెజెష్కియన్ ప్రధాని మోడీని కోరారు.

బ్రిక్స్ సమావేశంలో భాగంగా భారత్ కు చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తో పీఎం మోడీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరునేతల రెండు దేశాల మధ్య వాణిజ్యం బలోపేతానికి కావాల్సిన పలు అంశాలపై కీలక చర్చలు సాగించారు. తమ ఆర్థిక స్థితిస్థాపకతను (economic resilience) బలోపేతం చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం BRICSకు ఉందని ఇరాన్ అధ్యక్షుడు నొక్కి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -