Friday, September 11, 2026
E-PAPER
Homeజాతీయంబ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం

బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు సమ్మెను బ్యాంకు ఉద్యోగులు విజయవంతం చేశారు. వారంలో ఐదు రోజులకు పని దినాలను కుదించాలని, పనితీరు ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకంపై విభేదాలు, పెన్షన్ సంబంధిత డిమాండ్లతో సహా పలు ఇతర పెండింగ్ సమస్యలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా ఢిల్లీ, భోపాల్, చెన్నై, సిలిగురి, రాజ్‌కోట్, విజయవాడతో సహా పలు నగరాల్లో నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించారు. దేశంలోని బ్యాంకు ఉద్యోగుల సంఘాలైన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF) ల సమన్వయంతో 90శాతానికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -