Friday, September 11, 2026
E-PAPER
Homeక్రైమ్అదుపుతప్పి షాపులోకి దూసుకెళ్లిన సిమెంట్ లారీ

అదుపుతప్పి షాపులోకి దూసుకెళ్లిన సిమెంట్ లారీ

- Advertisement -

– తప్పిన పెనుముప్పు
నవతెలంగాణ-సత్తుపల్లి

సత్తుపల్లి పట్టణంలోని కల్పతరువు రోడ్డు వద్ద శుక్రవారం సిమెంట్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న షాపుల్లోకి దూసుకెళ్లింది. సూర్యాపేట నుంచి అశ్వారావుపేట వైపు వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అకస్మాత్తుగా లారీ దుకాణాల వైపు దూసుకురావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనతో ఒక పెద్ద ప్రాణనష్టం తప్పినట్లయింది. లారీ బలంగా ఢీకొనడంతో షాపు వద్ద నిలిపి ఉంచిన ద్విచక్రవాహనం (స్కూటీ) పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద ధాటికి లారీ ముందు భాగం అద్దాలు పగిలిపోవడంతో పాటు షాపులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ​సమాచారం అందుకున్న తక్షణమే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఆరా తీస్తున్నారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణాలని, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -