నవతెలంగాణ-ఆలేరు టౌను
సెప్టెంబరు 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని, సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం ఆరుట్ల రామచంద్రారెడ్డి సుశీలాదేవి విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయుధ పోరాట అమరవీరల ఆశయ సాధనకై ముందుకు సాగాలన్నారు. 1947 సెప్టెంబర్ 11న రావి నారాయణరెడ్డి ,బద్దం ఎల్లారెడ్డి ,ఆరుట్ల రామచంద్ర రెడ్డి ,లక్ష్మీనరసింహారెడ్డి ,కమలాదేవి తదితర నాయకత్వన తెలంగాణలో జరుగుతున్న వేట్టి చాకిరి విముక్తి కొరకు దున్నేవాడికే భూమి కావాలని పోరాడారని చెప్పారు.
ప్రజల చేతిలో రోకలి బండ, కారంపొడి తో దొర భూస్వామ్య పెత్తనం పై తిరగబడి వీరోచిత పోరాటాన్ని నిర్వహించిన నాటి అమరవీరులను స్మరించుకుంటూ వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని యువత ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలాగాని సత్యనారాయణ,కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, చెక్కా వెంకటేష్, ఎండి ఇమ్రాన్, చిగుల లింగం, ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు పోతు ప్రవీణ్, కందుల మధు, అన్న బోయిన రవి, తదితరులు పాల్గొన్నారు.



