ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-వనపర్తి
సీపీఐ(ఎం) అఖిలభారత మాజీ కార్యదర్శి, అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి సభను వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో శనివారం నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీతారాం ఏచూరి వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ జూలకంటి రంగారెడ్డి హాజరై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ వర్ధంతి సభకు సీపీఐ(ఎం) జిల్లా, పట్టణ, మండల కమిటీ సభ్యులతోపాటు సీపీఐ(ఎం) నాయకులు కార్యకర్తలు ప్రజాసంఘాల నాయకులు సకాలంలో హాజరై సభను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
రేపు అమరజీవి సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



