Friday, September 11, 2026
E-PAPER
Homeఖమ్మంసారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 

- Advertisement -

– ఏఐకేఎస్‌ 36 వ మహాసభల ప్రచారంలో భాగంగా జెండావిష్కరణ 
– దమ్మపేటలో సంస్మరణ సభ
నవతెలంగాణ – అశ్వారావుపేట 

అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ మహాసభల ప్రచారంలో భాగంగా తెలంగాణ రైతుసంఘం దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం దమ్మపేటలోని సుందరయ్య భవనం ఎదుట ఏఐకేఎస్‌ జెండాలను ఆవిష్కరించారు. నవంబర్‌ 15 నుంచి 18 వరకు నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్న మహాసభల విజయవంతానికి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం సుందరయ్య భవనంలో అమరజీవి కామ్రేడ్‌ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ తెలంగాణ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డా లక్ష్మినారాయణ అధ్యక్షతన జరిగింది.తొలుత సీనియర్‌ రైతు నాయకుడు యండ్రాతి అప్పారావు మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా యండ్రాతి అప్పారావు, దొడ్డా లక్ష్మినారాయణ, రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ సారంపల్లి మల్లారెడ్డి గొప్ప మేధావి, విజ్ఞాన గని, అంకితభావం కలిగిన రైతు నాయకుడని కొనియాడారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1937లో జన్మించిన ఆయన గ్రామ పటేల్‌గా, సర్పంచ్‌గా, కోఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌గా సుమారు 40 ఏళ్లపాటు ప్రజలకు, రైతులకు సేవలందించారని తెలిపారు.

కమ్యూనిస్టు పార్టీ విభజన అనంతరం సీపీఎం వైపు నిలిచి, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. రైతుసంఘంలో గ్రామస్థాయి నుంచి అఖిల భారత స్థాయికి ఎదిగి ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు. నీటిపారుదల, భూములు, విత్తనాలు, వ్యవసాయ రంగాలపై అపారమైన అనుభవం, విజ్ఞానం కలిగిన మల్లారెడ్డి మృతి రైతుసంఘానికి, సీపీఎంకు తీరనిలోటని పేర్కొన్నారు.

కార్యక్రమంలో రైతుసంఘం మండల అధ్యక్షుడు మోరంపూడి రామ్మోహన్‌రావు, కార్యదర్శి మోరంపూడి కేశవరావు, నాయకులు యండ్రాతి సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్‌, మండల కన్వీనర్‌ మురహరి రఘు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొలికిపోగు శ్రీనివాసరావు, రైతులు సీహెచ్‌ బ్రహ్మయ్య, మోటేపల్లి ధర్మయ్య, పెనుబల్లి సూర్యం, నారపోగు అనిల్‌కుమార్‌, చీకటి వెంకటలక్ష్మినారాయణ, బసవా శ్రీనివాసరావు, కూరం గోపిరాజు, కూరం సూర్యనారాయణ, కారం వెంకటేశ్వరరావు, ఎస్కే జాన్‌పాషా, తంగెళ్లమూడి రమేష్‌, కొప్పుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -