నవతెలంగాణ – జుక్కల్
నేటి నుండి మండలంలోని పలు గ్రామాలలో సెన్సెస్ సర్వే ప్రారంభిండం జరిగింది. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలో ని పడంపల్లి, నాగుల్ గావ్, బిజ్జల్వాడి , కత్తల్వాడి , చెండేగావ్, లొంగన్ మథురతాండ ,సోపూర్ , డోన్ గావ్, మహమ్మదాబాద్, గుల్లా తాండ, మాదాపూర్, చిన్నగుల్ల, పెద్ద ఏడ్గి, జుక్కల్, దోస్తుపల్లి, వజ్రకండి, ఖండేబల్లూర్, లాడే గావ్, హంగర్గ, ఆయా గ్రామాల గ్రామ సర్పంచ్ల అధ్యక్షతన సెన్సెస్ మొదటి రోజు సర్వే మ్యాప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజ్జల్ వాడి గ్రామంలో సర్వేలో పలువుర ఉపాధ్యాయులు పడంపల్లి హెచ్ఎం జగదీష్ ఇమ్యునేటర్ , బిజ్జల్ వాడి హెచ్ఎం ఈ. రవికుమార్ కత్తల్ వాడి టీచర్ నస్రీన్ భాను, ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ హౌస్ మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే మూడు రోజులు కూడా మాత్రమే కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బీపీ కార్యదర్శులు, పెద్దలు , జిపి కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.
నేటి నుండి గ్రామాలలో సెన్సెస్ సర్వే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



