నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని చెండేగావ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ , ఉప సర్పంచ్ అంతేశ్వర్ అధ్యక్షతన గ్రామంలోని ఎస్సీ కాలనీలో తీవ్రంగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రామంలోని నీటి సమస్యలు గత కొంతకాలంగా తీవ్రం కావడంతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు కాలనీవాసులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులతో చర్చించి నీటి సదుపాయం కల్పించాలని ఉద్దేశంతో నూతనంగా బోరు బావి వేసి , కొత్త మోటర్ బిగించాలని అదేవిధంగా పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసి ఇంటింటికి నీరు అందించే విధంగా జీపీ నిధులతో ఏర్పాటు చేశామని తెలిపారు. బోరు బావి వేసిన తర్వాత నూతనంగా నూతన మోటార్ బిగించడం, అదేవిధంగా నూతనంగా పైప్ లైన్ కూడా చేయడం జరిగిందని అన్నారు. ఎస్సీ కాలనీవాసులు ఎన్నో రోజుల నుండి నా సమస్యను పరిష్కరించిన సర్పంచ్ కృషితో సంతోషంగా.ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
చెండేగావ్ సర్పంచ్ ఆధ్వర్యంలో నీటి సమస్య పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



