Monday, May 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చట్టం సామాన్యులకేనా.?

చట్టం సామాన్యులకేనా.?

- Advertisement -

బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ కు వినతి
నవతెలంగాణ – తిమ్మాజిపేట

కేంద్ర మంత్రి బండి సంజయ్, కుమారుడు బండి భగీరథ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచ లనంగా మారిందని, ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక ఫిర్యాదు వంటి అత్యంత సున్నితమైన అంశంలో ప్రభుత్వం, పోలీసులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి బాధితురాలికి తక్షణ న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కేసు నమోదై ఉన్నప్పటికీ బండి భగీరథ్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడు..? ఎందుకు అరెస్టు చేయడం లేదు..? చట్టం సామాన్యులకేనా? అని ప్రశ్నించారు. సామాన్యులకు ఒకలాగా, అధికార పార్టీలకు మరోలా అమలవుతుందని  అన్నారు. బాధిత బాలికకు అన్యాయం చేయాలని మధ్యవర్తిత్వం వహిం చిన సంగప్పపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రత, బాలికల రక్షణ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇలాం టి కీలక వ్యవహారాల్లో ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. బీజేపీ “బేటీ బచావో” నినాదం నిజమైతే బండి సంజయ్ కుమార్ ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో ఈ కేసును అత్యంత ప్రాధాన్య తతో తీసుకొని, రాజకీయ ఒత్తిళ్లు లేదా హోదాలు పక్కనపెట్టి వెంటనే బండి భగీరథ్‌ను అరె స్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జోగు ప్రదీప్ మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి నాయకులు వేణుగోపాల్ గౌడ్, వెంకట్ స్వామి, జైపాల్ రెడ్డి, హుస్సేనీ తారాసింగ్, కొత్త వెంకటేష్, సలావుద్దీన్,  వెంకటయ్య, రఫిక్ కాళ్ళ రాజు ప్రశాంత్, వెంకటేష్ లోకేష్, సందీప్, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -