Saturday, August 22, 2026
E-PAPER
Homeజిల్లాలుసీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి యాకయ్య కుమారుడు మృతి 

సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి యాకయ్య కుమారుడు మృతి 

- Advertisement -

నివాళులర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు 
నవతెలంగాణ – భూపాలపల్లి
సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి యేల్తూరి యాకయ్య కుమారుడు, సీపీఐ(ఎం) భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు పెద్ద అల్లుడైన యేల్తూరి సమరకేతన్ (34) మృతి చెందాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో శనివారం మరణించాడు.

నివాళులర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు..
యేల్తూరి సమరకేతన్ మృతి చెందిన విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసి ఓదార్చారు. పరామర్శించిన వారిలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేష్, ఎస్.రమ, సిఐటియూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, రాష్ట్ర కోశాధికారి రాములు, నవతెలంగాణ భూపాలపల్లి స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -