Saturday, August 1, 2026
E-PAPER
Homeఖమ్మంఅనారోగ్య బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

అనారోగ్య బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

– అచ్యుతాపురం లో ముగ్గురికి ఆర్థిక సాయం, ఓదార్పు
నవతెలంగాణ – అశ్వారావుపేట

నియోజకవర్గంలోని అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులను శనివారం అశ్వారావుపేట బీఆర్ఎస్ నాయకులు వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న ఎల్ఐసీ ఏజెంట్ కొనకళ్ళ రమేష్ తండ్రి కొనకళ్ళ వెంకటేశ్వరరావును నాయకులు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న ఆర్సీఎం చర్చి పాస్టర్ దుక్కిపాటి చార్లెస్ కుమార్ ను పరామర్శించి పండ్లు, బ్రెడ్ అందజేయడంతో పాటు రూ.3 వేల నగదు ఆర్థిక సహాయం చేశారు. అలాగే హార్ట్ సమీపంలో ట్యూమర్‌తో బాధపడుతున్న బొమ్మగాని లచ్చి బాబు ను పరామర్శించి, ఆయనకు రూ.5 వేల నగదు ఆర్థిక సహాయంతో పాటు పండ్లు, బ్రెడ్ అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. బాధితులు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ డాక్టర్. ఉదయ జ్యోతి, డా. ప్రసాద్, కాసాని చంద్రమోహన్, కాసాని నాగ శేష పద్మ, పాక్స్ డైరెక్టర్ తెల్లమేకల కన్నయ్య, స్థానిక ఉప సర్పంచ్ పాకనాటి నాగేశ్వరరావు, వార్డు సభ్యులు కోటమర్తి అప్పారావు,నక్క చిరంజీవి, బెల్లం గణేష్,పంబి శ్రీను,అశ్వారావుపేట మాజీ టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, జుజ్జురపు శ్రీరామమూర్తి, అశ్వారావుపేట మాజీ ఉప సర్పంచ్ తగరం జగన్నాథం,జూపల్లి భుజంధర్, పాలవలస జీవనరావు,వేదాంతపురం ఉప సర్పంచ్ సంగీత వీర్రాజు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -