Saturday, August 1, 2026
E-PAPER
Homeఆటలుకామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మహిళా బాక్సర్ ల అద్భుత ప్రదర్శన

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మహిళా బాక్సర్ ల అద్భుత ప్రదర్శన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 54 కేజీల విభాగం ఫైనల్లో ప్రీతి పవార్ కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నాహ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రౌండ్‌ నుంచే దూకుడుగా ఆడిన ప్రీతి వరుస పంచ్‌లతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసింది. రెండో, మూడో రౌండ్‌ల్లోనూ అదే జోరు కొనసాగించడంతో న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా (యునానిమస్‌ డెసిషన్‌) ఆమెను విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో బాక్సింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించగా, దేశానికి ఇది ఆరో స్వర్ణం, మొత్తంగా 24వ పతకం అయింది. ఇప్పటికే బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు కనీసం 10 పతకాలు ఖాయమయ్యాయి.

అదే విధంగా మహిళల 57 కేజీల విభాగం ఫైనల్లో జాస్మిన్ లంబోరియా కూడా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఐర్లాండ్‌కు చెందిన మికెలియాపై ఆమె ఆధిపత్యం చాటుతూ విజయం సాధించింది. జాస్మిన్‌ స్వర్ణంతో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ స్వర్ణాల సంఖ్య ఏడుకు, మొత్తం పతకాల సంఖ్య 25కు చేరింది.

మరోవైపు పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో భారత అథ్లెట్లు రాణించారు. ప్రవీణ్ చిత్రవేల్ 16.58 మీటర్లు దూకి రజత పతకాన్ని గెలుచుకోగా, సెల్వ ప్రభు 16.52 మీటర్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ మొత్తం పతకాల సంఖ్య 27కు చేరుకుంది. ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో 7 స్వర్ణాలు, 13 రజతాలు, 7 కాంస్య పతకాలు నమోదయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -