Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ కేసు నమోదు

పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సంఘటన  మండలంలోని కుదాభక్ష పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కుదాభక్షపల్లి గ్రామానికి చెందిన బొంత మల్లేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్.ప్రసన్న బాబు సంతకమును ఫోర్జరీ చేసి తప్పుడు దృవపత్రాలను సృష్టించి గ్రామ కంఠానికి చెందిన 188 గజాల భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేయటం జరిగిందని అన్నారు.కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న ఫోర్జరీ బాధితుడైన పంచాయతీ కార్యదర్శి ఎస్.ప్రసన్న బాబు  తన సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా గ్రామ కంఠం భూమిని కబ్జా చేయటానికి ప్రయత్నం చేస్తున్న బొంత మల్లేష్ పై చర్యలు తీసుకోవాలని శనివారం మర్రిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని,ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -