Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం..యువకుడు మృతి

పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం..యువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు మృతి చెందాడు. ఈ నెల 7న మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో దుర్గాప్రసాద్(30) ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం ఓ యువతి, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో పోలీస్ స్టేషన్‌లోనే దుర్గాప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు, పోలీసుల తదుపరి చర్యలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -