- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని లెంకలపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గురువారం మైసమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను అందంగా అలంకరించుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివసత్తుల శిగాలు, డప్పు చప్పుల మధ్య బోనాల పండుగ కన్నులకు విందుగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



