Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్‌ కార్యాలయంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు

మున్సిపల్‌ కార్యాలయంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కొరకు వీరనారి చాకలి ఐలమ్మ కృషి చేశారని, ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి పురస్కరించుకొని ఆమె విగ్రహానికి, మున్సిపల్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలమణి భాస్కర్ మాట్లాడుతూ.. పేదలు రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. 

అన్యాయానికి, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం, ఆత్మగౌరవం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం, సమానత్వం కోసం చాకలి ఐలమ్మ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు,ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ బి జగన్ మోహన్, కౌన్సిలర్  మల్లెల సరిత శ్రీకాంత్, పట్టణ ప్రముఖులు జెట్ట సిద్ధులు, వనరాశి మార్క్, ఏగ్గిడి శ్రీనివాస్, పాషికంటి కృష్ణ,బాలు, మున్సిపల్ సిబ్బంది పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -