నవతెలంగాణ-ఆలేరు టౌన్
తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, టి ఎమ్మార్పీఎస్, నూతన కమిటీని ఆలేరు పట్టణంలో గురువారం పద్మావతి ఫంక్షన్ హాల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారు. సమావేషానికి టి ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జీ కందుల రామన్, టి ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా వెనుకబడటం వల్ల ఆర్థిక అసమానతలను ఎదుర్కోవడం కష్టమవుతోందని తెలిపారు.
మాదిగలు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగడంతోపాటు, తమ హక్కుల సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీఎస్ ఎమ్మార్పీఎస్ ఆలేరు మండల అధ్యక్షుడిగా జంగా రాములు , వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భూపెల్లి కేశవులు, ఎమ్మెస్సెఫ్ మండల ఇన్‌చార్జిగా రాంచర్ల గౌతమ్‌ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు ఏ సుధాకర్, ఆర్ సిద్ధులు, బోడ నరేష్, ఎస్.సురేష్, కె.యాద మల్లయ్య, రవి, కె.మధు, మనుష్ , అర్జున్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.



