నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని రామానుజాపురం గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే పనులను తొర్రూర్ ఆర్డీవో గణేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్, నల్లికుదురు తహసీల్దార్ చందా నరేష్ పరిశీలించినట్లు తెలిపారు. గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, ప్రభుత్వ భూముల గుర్తింపు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. రీసర్వే పనుల పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకుని, పనులను నిర్ణీత ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. భూ హక్కుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, క్షేత్రస్థాయిలో హద్దుల నిర్ధారణను పారదర్శకంగా చేపట్టాలని అధికారులు సూచించారు. రీసర్వేలో గుర్తించిన ప్రభుత్వ భూములు, ఇతర ప్రభుత్వ ఆస్తుల వివరాలను సక్రమంగా నమోదు చేసి, సంబంధిత రికార్డులను నవీకరించాలని ఆదేశించారు.రీసర్వే ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ సురేందర్, ఎమ్మారై రామకృష్ణ, జిపిఓ మధుసూదన్ సిబ్బంది పాల్గొన్నారు.
రామానుజాపురంలో రీసర్వే పనుల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



