బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఐ బొమ్మ’. శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అతిథిగా వచ్చిన నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ,‘ట్రైలర్ బాగుంది. ఈ రోజు సమా జంలో జరుగుతున్నదే కథగా చూపించారు’ అని తెలిపారు. ‘నేను వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మించిన తర్వాత డైరెక్టర్ విజయ్ కలిసి రెండు, మూడు స్క్రిప్ట్స్ కూడా చెప్పాడు. మంచి టాలెంట్ ఉన్న యువ దర్శకుడు విజయ్. ట్రైలర్ బాగుంది. ఈ సినిమా విజయ్ తో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి’ అని ప్రొడ్యూసర్ రాజా చెప్పారు.చిత్ర నిర్మాత కురువ జమన్న మాట్లాడుతూ,‘మా వృత్తి వ్యవసాయం. సినిమాల మీద ఇష్టంతో చిత్ర నిర్మాణంలోకి వచ్చాను. దర్శకుడు విజయ్ చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ కథను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారనే నమ్మకం ఉంది. మా చిత్రానికి మీ అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను’ అని తెలిపారు.
‘గతేడాది అంతా ఐ బొమ్మ గురించే న్యూస్ వైరల్ అయ్యింది. మనలో చాలా మంది ఐ బొమ్మ పైరసీ సినిమాలు చూసే ఉంటారు. ఈ సైట్ ఇప్పుడు లేదు కానీ అసలు ఆ సైట్ ప్రారంభించడం వెనక, నిర్వహించడం వెనక ఏం జరిగింది అనేది అందరికీ ఆసక్తికరమే. జీవితంలో కొన్ని సంఘర్ష ణలకు లోనైన ఓ వ్యక్తి సమాజానికి వ్యతిరేకంగా ఎలా అడుగువేశాడు?, అతన్ని ఈ వ్యవస్థ ఎలా పట్టుకుంది. అతని ఆలోచన వెనక ఏం జరిగింది అనే అంశాలతో ఈ సినిమా రూపొందించాం. ఓవర్ ది నైట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి 15 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ కు తీసుకురాబోతున్నాం’ అని డైరెక్టర్ విజయ్ రఘునాథభట్ల చెప్పారు. నటులు బానోతు పవన్, గౌతమ్, సతీష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
‘ఐ బొమ్మ’ అసలు కథేంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



