నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని స్మైల్స్ ది స్కూల్లో శనివారం ఫ్రెండ్‌షిప్ డే (స్నేహితుల దినోత్సవం)ను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఒకరికొకరు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టుకుని, గ్రీటింగ్ కార్డులు బహుమతిగా ఇచ్చిపుచ్చుకుని, ఆప్యాయంగా కరచాలనం చేసుకుని, హగ్ చేసుకుంటూ తమ స్నేహ బంధాన్ని మరింత బలపరిచారు. విద్యార్థులు వివిధ సరదా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి షబానా గోహర్ మాట్లాడుతూ, “స్నేహం అనేది జీవితంలో అత్యంత విలువైన బంధం. మంచి స్నేహితులు మనకు మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు నేర్పిస్తారు. విద్యార్థులు పరస్పరం ప్రేమ, గౌరవం, సహకార భావంతో ముందుకు సాగాలి” అని తెలిపారు.
పాఠశాల డైరెక్టర్ మహ్మద్ రఫీఉద్దీన్ గోహర్ (రఫీ గోహర్) మాట్లాడుతూ, “నిజమైన స్నేహితుడు కష్టసుఖాల్లో తోడుగా నిలిచే వ్యక్తి. శ్రీకృష్ణుడు–సుదాముల స్నేహం వంటి గొప్ప స్నేహ బంధాలు మనకు ఆదర్శం. ప్రతి విద్యార్థి మంచి స్నేహితుడిగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలి” అని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని ‘హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే’ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



