Monday, May 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్కారు బడుల్లో వారోత్సవాల సందడి షురూ

సర్కారు బడుల్లో వారోత్సవాల సందడి షురూ

- Advertisement -

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలిక్కి తీయడం
పాఠశాలలపై విశ్వాసం పెంచడం
నవతెలంగాణ – మల్హర్ రావు

విద్యా ప్రమాణాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 11 నుంచి 17 వరకు ఏడు రోజుల పాటు విద్యాశాఖ వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు.రోజుకో కార్యక్రమం చొప్పున అధికారులు ఏడు రకాల కార్యక్ర మాలు చేపడుతున్నారు. సర్కారు బడులపై విశ్వాసం పెంచడం, విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడం, తల్లిదండ్రులు,ప్రజా ప్రతినిధులను భాగసామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఏడు రోజుల పండుగ
మండల వ్యాప్తంగా 34 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఒక మోడల్ స్కూల్, ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల, 26 ప్రాథమిక, ఒక యూపీఎస్, ఐదు జిల్లా పరిషత్ పాఠశాలున్నాయి. ఇందులో 1436 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. సోమవారం ప్రారంభోత్సవాల సం దడిగా మారింది. కొత్త పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఆధునిక టాయిలెట్ల ను ప్రారంభించారు. మోడల్ స్కూల్, కస్తూరిబ్బా లో 15 రోజులపాటు ప్రత్యేక శిబిరాలు, కోడింగ్, రోబోటిక్స్, యోగా, కరాటే, క్రీడలు, నాటకం, సంగీతంతో పాటు వ్యక్తిత్వ వికాస తరగతులు, సమ్మర్ క్యాంప్లు ప్రారంభించారు.

వారోత్సవాలు ఇలా..
వారోత్సవాలను 11 నుంచి 17 వరకు ఘనంగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా డీఈవో రాజేందర్ ఆదేశించినట్లుగా మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఉపా ధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.12న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, పెయిలైన సభ్జెక్టుల్లో నిపుణులచే ఉచిత కోచింగ్ ఇప్పిస్తారు.13న సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో విద్యాభివృద్ధిపై వర్క్ షాప్లు నిర్వహిస్తారు.

బడి బాగు కోసం వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు.14న ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను గుర్తించి నమోదు చేస్తారు. అదేరోజు పేరెంట్, టీచర్ మీటింగ్లు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, మధ్యాహ్న భోజనం వంటల పోటీలు నిర్వహిస్తారు. 15న లైబ్రరీ ది హార్ట్ ఆఫ్ నాలెడ్జ్ పేరుతో పుస్త క ప్రదర్శనలు, విద్యార్థులతో బుక్ టాక్ కార్యక్రమాలు ఉంటాయి. అన్ని లైబ్రరీలను డిజిట లైజ్ చేసి ఆన్లైన్ క్యాటలాగ్ ప్రారంభిస్తారు.16న తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కోలాటం, ఒగ్గుకథ, లంబాడీ నృత్యం, పేరిణి శివతాండవం వంటి కళారూపాలను ప్రద ర్శిస్తారు. విద్యార్థులతో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ చేపడతారు.17న ముగింపు రోజు పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి టాపర్లను సన్మానిస్తారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -