Saturday, September 12, 2026
E-PAPER
Homeఆటలుహైదరాబాద్‌ ‌కెప్టెన్‌‌గా మహ్మద్‌ ‌సిరాజ్‌

హైదరాబాద్‌ ‌కెప్టెన్‌‌గా మహ్మద్‌ ‌సిరాజ్‌

- Advertisement -

వైస్‌ ‌కెప్టెన్‌‌గా సివి మిలింద్‌ ఎంపిక
నవతెలంగాణ-హైదరాబాద్‌
2026-27 రంజీ సీజన్‌‌కు హైదరాబాద్‌‌కు భారత స్టార్‌ ‌పేసర్‌, మియాభాయ్‌ ‌మహ్మద్‌ ‌సిరాజ్‌ ‌సారథ్యం వహించనున్నాడు. మరో సీనియర్‌ ‌పేసర్‌ ‌సివి మిలింద్‌ ‌వైస్‌ ‌కెప్టెన్‌‌గా వ్యవహరిస్తాడు. మహ్మద్‌ ‌సిరాజ్‌ అందుబాటులో లేకపోతే.. సివి మిలింద్‌ ‌కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు హైదరాబాద్‌ ‌సీనియర్‌ ‌సెలక్షన్‌ ‌కమిటీ శుక్రవారం ఉప్పల్‌ ‌స్టేడియంలో సమావేశమై జట్టు నాయకత్వంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. గత సీజన్‌‌లో హైదరాబాద్‌‌కు తిలక్‌ ‌వర్మ కెప్టెన్సీ వహించగా.. రాహుల్‌ ‌సింగ్‌ ‌వైస్‌ ‌కెప్టెన్‌‌గా కొనసాగాడు. భారత సీనియర్‌ ‌జట్టులో తిలక్‌ ‌వర్మ నాయకత్వం బృందంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తుండగా.. హైదరాబాద్‌ అతడిని పక్కనపడుతూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఈ ఏడాది రంజీ సీజన్‌‌కు హైదరాబాద్‌ ‌జట్టును ఇంకా ఎంపిక చేయలేదు. జట్టు నాయకత్వం, చీఫ్‌ ‌కోచ్‌‌తో సంప్రదింపుల అనంతరం రంజీ ట్రోఫీ టీమ్‌‌ను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -